ప్రియాంకా రెడ్డి మర్డర్ పై తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ - Latest Telugu News

LatestSunday, 1 December 2019

ప్రియాంకా రెడ్డి మర్డర్ పై తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ

ప్రియాంకా రెడ్డి మర్డర్ పై ఆర్జీవీ తన దైన శైలిలో ట్వీట్లు వర్షం కురిపించాడు. ఒక పక్క ప్రపంచమంతా నేరస్థులను నడిరోడ్డు మీద ఉరి తీయాలని అంటుంటే రాము మాత్రం ముందుగా ఆ నేరస్థుల మానసిక పరిస్థితిని శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోమని వారు ఆ విదంగా అవటానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే రాబోయే అవరోధాలను ఆపొచ్చని పైగా నేరస్థులను గుర్తించటంలో అది సహాయ పడుతుందని సూచించాడు. రేప్ చేయాలి అనుకుంటే నేను దొరికిపోతాను కదా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవడు ఆ నేరం చేయలేడు అని అది అందరి మనసులోనూ నాటేలాగా శాస్త్రీయ పద్ధతితో నేరస్థుల అంతర్గత భావాలు తెలుసుకోండని హితవు పలికాడు.
ram-gopal-varma-comments-on-priyanka-reddy-rape


 రామ్ గోపాల్ వర్మ చేసిన కొన్ని ట్వీట్లు

శిక్ష భయం ఎప్పుడూ ఏ నేరాన్ని ఆపదు ఎందుకంటే స్వభావంతో ఒక నేరస్థుడు తనను ఎప్పటికీ పట్టుకోలేడని నమ్ముతాడు. కానీ అతను చిక్కుకుపోతాడని అనుకుంటే అతను ఎప్పటికీ నేరం చేయడు.

పట్టుకోవడం, శిక్షించడం తర్వాత మరో రేప్ జరిగిలోగా మరచిపోయే బదులు అసలు వారి మనస్తత్వాలు ఏంటో ఒక సారి తెలుసుకోవటం వలన అది నేరస్థులను గుర్తించటంలో సహాయ పడుతుందని వ్యాఖ్యానించారు.


No comments:

Post a Comment