విశాఖకు త్వరలో మెట్రో రైలు అంటున్న ఏపీ మంత్రులు బొత్స, అవంతి - Latest Telugu News

LatestSunday, 1 December 2019

విశాఖకు త్వరలో మెట్రో రైలు అంటున్న ఏపీ మంత్రులు బొత్స, అవంతి

 పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విశాఖ మెట్రో కారిడార్ కు సంబంధించి ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. విశాఖపట్నం మెట్రో ప్రణాళికపై అధ్యయనం జరుగుతుందని అన్నారు. మెట్రో కారిడార్‌ అధికారులతో కలిసి ఇద్దరు మంత్రులు విశాఖ నగరంలో పర్యటించారు. విశాఖలో మూడు కారిడార్లలో నిర్మాణం చేపట్టేందుకు గతంలో డీపీఆర్‌ సిద్దమయింది. ఈ నేపథ్యంలో ఆ నివేదిక ప్రకారం కారిడార్లు నిర్మించబోయే ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలించారు.

vishaka-metro-rail

విశాఖ మెట్రో మూడు కారిడార్లలో నిర్మాణం జరుపుకునేందుకు సిద్ధంగా వుండగా ఇది మొత్తం 42.55 కిలో మీటర్ల మేర సుమారు 8,300 కోట్ల వ్యవధితో నిర్మించనున్నారు.

గాజువాక నుంచి కొమ్మాడి: 31 కిలో మీటర్లు
గురుద్వార నుంచి పాత పోస్ట్ ఆఫీస్: 5.55 కిలో మీటర్లు
తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు: 6 కిలో మీటర్లు

No comments:

Post a Comment